నేనేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదు: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్య
Advertisement
- ఆందోళనల వేళ రాహుల్ విదేశాలకు వెళ్లారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు
- రాహుల్ పర్యటనను సమర్థించిన మరో కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్
- సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మధ్య ఈ పరిణామం
Advertisement
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ ఆసక్తికరంగా స్పందించారు. రాహుల్ పర్యటన గురించి మీడియా ప్రశ్నించగా, "నేనేమీ ట్రావెల్ ఏజెంట్‌ను కాదు" అంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
బుధవారం తిరువనంతపురంలో శశిథరూర్ విలేకరులతో మాట్లాడుతూ "నేను ట్రావెల్ ఏజెంట్‌ను కాదు. ఆ ప్రశ్న నన్ను అడగటంలో అర్థం లేదు. నేను ఢిల్లీ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాను? ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి, నేను ఆ విషయంపై వ్యాఖ్యానించలేను" అని స్పష్టం చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (సర్)కు వ్యతిరేకంగా ఢిల్లీలో విపక్షాలు ఆందోళనలు చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. రాహుల్ వియత్నాం వెళ్తున్న విమానంలో ఉన్నారంటూ ఒక వీడియోను బీజేపీ 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసింది. నిరసనలతో బాగా అలసిపోయినందువల్లే ఆయనకు విశ్రాంతి అవసరమైందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఎద్దేవా చేశారు.
అయితే, రాహుల్ గాంధీ పర్యటనను కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ సమర్థించారు. ప్రధాని సహా ఇతర నేతలు విదేశాలకు వెళ్లడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీశారు. విదేశాల్లో రాహుల్ విద్యార్థులతో, మేధావులతో సమావేశమవుతారని, ఇంటర్వ్యూలు ఇస్తారని ఆయన గుర్తుచేశారు.